కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆశ వర్కర్లు రేపు విజయవాడలో ధర్నా జరుగుతుండగా ఈ రోజు తెల్లవారు జామున సామర్లకోట పోలీసులు సీ.ఐ.టీ.యూ. జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి స్టేషన్ లో సుమారు 6గంటలు ఉంచారు. 151 కేసు పెట్టి సంతకాలు తీసుకొని విడిచి పెట్టారు. ఆశ వర్కర్లు అధ్యక్షులు గ్రేస్ ను గృహ నిర్భంధంలో ఉంచారు.
అక్రమ అరెస్టులను ఖండిస్తూ సీ.ఐ.టీ.యూ. ప్రధాన కార్యదర్శి ఎన్. సురేష్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, టి నాగమణి, బాలం సత్తిబాబు, కరణం గోవిందరాజు తదితరులు నిరసన వ్యక్తంచేసారు. విజయవాడ లో ధర్నాకు ఇక్కడ అరెస్టులు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారని విమర్శించారు. మహిళల వద్దకు నలుగురు పురుష పోలీసులు వెళ్లడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

