వంటకాల్లో ఘాటు రప్పించే ఉల్లిని కోస్తేనే కళ్ల వెంట నీళ్లు వస్తుంటాయనుకుంటారు. దాని ధర విన్నా గుండె గుభేల్ మంటుంది. మార్కెట్లో ఉల్లిధర రూ.70 నుంచి రూ.80 కి చేరుకుంది. ఉల్లి ఉత్తత్పత్తి తగ్గడం, రిటైల్ మార్కెట్‌లో అందుబాటులో లేకపోడంతో వ్యాపారులు ధరను విపరీతంగా పెంచేశారు. ఇటీవలే ఉల్లి రైతుల్లో కొందరు కోటీశ్వరులైనట్టు వినుంటారు. ఉల్లిపాయల కోసం ఇద్దరు వ్యాపారులను వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తు హత్యచేసిన విషయం విదితమే. ఇలా అనేక సంఘటనలకు, సన్నివేశాలను ఉల్లి వేదికవుతోంది. ఈ నేపద్యంలో కేంద్రం ఉల్లి సరఫరాకు చర్యలు చేపడుతోంది. ధరల స్థిరీకరణ కోసం లక్ష టన్నుల ఉల్లిని సరఫరా చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు.
రూ.70 నుంచి 80కి ఉల్లి పాయే….

