ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి రోజు నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి ఉన్న నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచడం జరిగిందన్నారు.
అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారా పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఇడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావింతం చేసే వస్తువులపై నిరంతరం నిఘా కాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

