రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజా ఎక్కవ కావడంతో అరాచకాలు ఎక్కువవుతున్నాయని రాష్ట్ర తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఇటీవల ఒక మైనర్ దళిత బాలిక (17) ను గ్యాంగ్ రేప్ చేసారన్నారు. రాజమండ్రిలో గతంలో ఇదే మాదిరిగా ఒక దళిత యువతి అత్యాచారానికి గురైందని అన్నారు. మరో దళిత యువతిని తనకు కాబోయే భర్త ముందే గ్యాంగ్ రేప్ చేశారన్నారు.
ఇందుకు కారణమయి వారిని ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేదని వాపోయారు. దీనికి కారణం గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యం కావడం, కల్తీమద్యం తాగాడం వల్ల యువత ఇలాంటి ధారుణాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని మహిళల మాన ప్రాణాలకు రక్షణ కావాలంటే టీ.డీ.పీ. అధికారంలోకి రావాలని అన్నారు.

