రాయలసీమ జిల్లాలో రాప్తాడు సిద్ధం సభను అత్యంత అధ్బుతంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సభకు వై.సీ.పీ. పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమలో నాకు జన సముద్రం కనిపిస్తుందని అన్నారు. జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జనసముద్రం వస్తే, రాష్ట్రానికి జలసముద్రాం వచ్చిందన్నారు. రాయలసీమ గడ్డకు మీ రాయలసీమ బిడ్డ మనసుతో అభివాదం చేస్తున్నాడన్నారు.
2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతుందని ఆయన అన్నారు. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదని ఐదేళ్లకాలంలో మన ప్రభుత్వం ఇంటింటికి అందించిన సంక్షేమానికి, అభివృద్ధికి డ్రామాలు ఆడే చంద్రబాబు యుద్ధానికి మీరు సిద్దామా అని అడిగారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న తనకు మాటతప్పటమే ఆలవాటుగా ఉన్న పెత్తందారలకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.

