ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సంపూర్ణ ఆనందాన్ని… సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడని ఆయన అన్నారు. పెద్దలు, అనుభవజ్ఞులు పట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి… మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు… -పవన్ కళ్యాన్-

