రామేశ్వరం కేఫ్ పేలుళ్ల ఘటనలో ఎన్.ఐ.ఏ. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా లేదా అన్నది నిర్ధారించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర శనివారం తెలిపారు. వారి అరెస్టుకు దారితీసిన కొన్ని ఇన్‌పుట్‌లను అందించినందుకు రాష్ట్ర పోలీసులను కూడా ఆయన ప్రశంసించారు. మరోవైపు నిందితులను 10 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్.ఐ.ఏ., కర్ణాటక పోలీసులు ఇద్దరూ అద్భుతంగా పనిచేశారని అన్నారు. ప్రారంభంలో అన్ని సి.సి. టి.వి. ఫుటేజీలను పొంది, నిందితులలో ఒకరిని ట్రాక్ చేసామని చెప్పారు. ఇది వారి పట్టుకోవడానిక చాలా సహాయపడిందని ఆయన చెప్పాడు.
రామేశ్వరం కేఫ్ పేలుళ్ల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్…

