Political

రాజ్యాంగం ఇచ్చిన ఓటుహక్కు వినియోగించాలి… -కాకినాడ జిల్లాకలెక్టర్ జె. నివాస్-

WhatsApp Image 2024-05-03 at 5.22.03 PM

రాజ్యాంగం పౌరులం దరికీ సమానంగా అందించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ జె. నివాస్ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రగతి ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలని లోక్‌సభ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా ప్రతి ఓటరు పోలింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పౌర సంక్షేమ సంఘం స్వచ్ఛందంగా ముద్రించిన ఓటుహక్కు వినియోగం ప్రజా స్వామ్య ప్రయోజనం కరపత్రాలను కలెక్టరేట్ ఛాంబర్ లో నివాస్ ఆవిష్కరిం చారు.

పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగా లని కోరారు. పోలింగ్ పట్ల పౌరులు ఆసక్తి తగ్గించుకోవడం మంచిది కాదన్నారు. పోటీలో వున్న అభ్యర్థుల్లో ఒకరికి ఓటు వేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలను ప్రతీ పౌరుడు గౌరవించాలన్నారు. అభ్యర్థులు నచ్చకుంటే సుప్రీం కోర్టు ఇచ్చిన అవకాశం ప్రకారం ఎన్నికల కమీషన్ కల్పించిన నోటా కు ఓటు వేయాలని సూచించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.