ఏపీ కు ప్రత్యక హోదా ఇవ్వకుండా, పోలవరం పూర్తి చేయకుండా విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయని బీ.జే.పీ. ప్రభుత్వానికి ఏ.పీ. ప్రజలు ఎందుకు ఓటు వేయాలని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గా సభ్యులు రావుల వెంకయ్య ప్రశ్నించారు. కాకినాడలో స్థానిక సాంబమూర్తి నగర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పి.ఆర్. భవన్ లో సి.పి.ఐ. పాత్రికేయుల సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ… భారతదేశంలో మతోన్మాదం పెట్రేగిపోతుందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా బీ.జే.పీ. పరిపాలన విధానాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే బీ.జే.పీ. ని ఓడించాలని, మతోన్మాద బీ.జే.పీ. పార్టీతో పొత్తులు కుదుర్చుకున్న పార్టీలను సైతం సాగనంపాలని వారికి గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజ్యాంగ హక్కుల రక్షణకై బీ.జే.పీ. ని ఓడించాలి…

