పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామంలో జనసేనా అధినేత కొణిదెల పవన్ కళ్యాన్ రాకతో జన సైనికుల జయజయధ్వానాలతో దద్దరిల్లింది. వీర మహిళల కేరింతలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో, హర్షధ్వానాలతో రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు వారాహి విజయభేరీ యాత్ర ఘనంగా నిర్వహించారు. యానాం నుంచి ద్రాక్షారామం మధ్య ఉన్న గ్రామ గ్రామాన ప్రజలు ఆయనకి హారతులతో ఘన స్వాగతం పలికారు. 18 కిలోమీటర్ల ప్రయాణం గంటన్నరకుపైగా సాగింది, అయితే సుమారు 8 గ్రామాల్లో ఆయన నిర్వహించి కూటమి పక్షాలను, ప్రజలను ఉత్సాహపరిచారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. రాజోలు నియోజకవర్గం మలికి పురం చేరుకున్న ఆయన అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజోలు గడ్డ.. జనసేన అడ్డా.. అని నిరూపిస్తూ జన ప్రభంజనం మధ్య వారాహి సభ కొనసాగించారు. వీర మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకగా కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలు పరిష్కరించాలంటూ మోరి, మోరిపాడు జీడిపిక్కల కార్మికులు వినతి పత్రాలు సమర్పించారు.

