కాకినాడ అర్బన్ లోని రేచర్ల పేట కు చెందిన ప్రభు తేజ అనే యువకుడుపై నలుగురు తనపై దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారు. దానితో ఆ యువకుడు ఆ రక్తపు మరకలతోనే మెజిస్ట్రేట్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… గతంలో రెండు వర్గాల మధ్య పాత విభేదాలు ఉండడంతో ప్రభు తేజ పై రాజు, రాజేష్, విక్కీ, సాగర్ అనే నలుగురు దాడిచేసి కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దానితో అసహనానికి గురయిన అతడు ఆ రక్తపు మరకలతోనే జడ్జి దగ్గరకి వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. అది విన్న మెజిస్ట్రేట్ ముందు ఆసుప్రతికి వెళ్లి చేయించుకోవలసిందిగా అతడికి సూచించారు.
రక్తపు మరకలతో మెజిస్ట్రేట్ వద్దకు వెళ్లిన కాకినాడ యువకుడు…!!!
