మత్స్యకారులూ అన్యధా భావించకండి.. ఇవి గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యల అలజడి కి ఎమ్మెల్యే ద్వారంపూడి ఎట్టకేలకు మర్మగర్భంగా పుల్ స్టాప్ పెట్టి మత్స్యకార జాతికి అన్యధా భావించవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఈనెల 17వ తేదీన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపణలపై ఖండిస్తూ పొరపాటున నోరు జారి అన్న మాటపై మత్స్యకారులు ఎవరైనా మనస్థాపం చెందినట్లయితే వారు అన్యధా భావించవద్దు అంటూ పేర్కొన్నారు.
కాకినాడ నగరంలో తక్కువ మంది ఉన్న తమ సామాజిక వర్గానికిచెందిన తనకు మత్స్యకార జాతి రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచి ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రధాన కారకులు అయ్యారని తన క్షేమాన్ని కోరే మత్స్యకారులు తన మాటతో ఇబ్బంది పడినట్లయితే అన్యత భావించవద్దని ఆయన కోరారు.
అయితే రాష్ట్ర వ్యాప్త మత్స్యకార జే.ఏ.సీ. ఆధ్వర్యంలో వారం రోజులు పాటు సమయం ఇవ్వడంతో ఈ సమస్యను జటిలం చేయకుండా ఉండేందుకుగాను ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ సిటీ వై.సి.పి. వైస్-ప్రెసిడెంట్ చెక్కా చక్రవర్తి, తదితరులు ఉన్నారు.
