తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ధరుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని కొంతమంది దుండగులు కత్తులతో బెదిరించి పంప్ హౌజ్లో చోరీకి పాల్పడ్డారు. వివరాళ్లోకి వెళ్తే… ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం సబ్ స్టేషన్ వద్ద ఉన్న దేవాదుల పంప్ హౌజ్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అర్ధరాత్రి కింతమంది దుండగులు వచ్చి కత్తులతో బెదిరించి విలువైన సామగ్రిని దోచుకెళ్ళారు. సీసీ పుటేజ్ ఆధారంగా ఈ ఘటనకు పాల్పడిన దుండగులుపై కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ములుగు జిల్లాలో పంప్ హౌస్ లో చోరీ…

