Kakinada

మురుగు బురద సిటీగా తయారయ్యిన కాకినాడ…

kkd

కాకినాడ వీధుల్లో కాల్వలు ప్రవహించక పోవడం వలన కురుస్తున్న వర్షాలకు మురుగు బురద పలు వ్యర్థాలతో రోడ్ల మీదకు చేరుతున్న దుస్థితి తీవ్రంగా ఉందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. నగర ప్రజలకు వీధి వీధినా ఇంటివాకిళ్ల ముంగిటకు వచ్చి పడుతున్న మురుగు బురద అవస్థలు ఎక్కువయ్యాయన్నారు. డ్రైన్లలో వ్యర్థాలు కల్వర్టుల దిగువ పూడికలు పూర్తి స్థాయిలో తొలగించి తరలించకపోవడం వలన ఇరుకు తూముల్లో ప్రవహించని అవుట్ లెట్స్ వలన దుర్గంధం దుస్థితి తయారయ్యిందని అన్నారు.

కార్పోరేషన్ అధికారులు చెబుతున్న పౌర సౌకర్యాల నిర్వహణ ప్రకటనలకే పరిమితం కావడం దురదృష్టకరంగా వుందన్నారు. కాకినాడ మురుగు బురద సిటీగా మారడం సిగ్గుచేటన్నారు. జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపడుతున్న సగిలి షన్మోహన్ స్పెషల్ ఆఫీసర్ గా కాకినాడ ముంపు నివారణకు ప్రత్యేక సమీక్ష చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ