Exclusive

మున్సిపల్ కార్మికుల ఒంటి కాళ్లతో నిరసన…

municipal-employees-1-1627896766-1657864603

కాకినాడలో స్థానిక శారదా దేవి గుడి వద్దనున్న నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మొదట ఒంటె కాళ్లతో నిరసన చేస్తూ… సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో తోకల ప్రసాద్, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. తమకు జీతాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని మరియు పీ.ఎఫ్. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేసారు. అనంతరం ప్రదర్శనగా మున్సిపల్ కార్యాలయం నుండి శారదా దేవి గుడి, కరెంట్ కార్యాలయం, జిల్లా లేబర్ కార్యాలయం, జిబిటి రోడ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం దగ్గర చేరుకుని సమ్మె ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… మున్సిపల్ వర్కర్స్ డిమాండ్స్ పరిష్కరించకుండా ప్రత్యామ్నాయ పనులకు ఆదేశాలిస్తే పనులను అడ్డగిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఏ.పీ. మున్సివల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొబ్బిలి శ్రీనివాసరావు, తుపాకుల లక్ష్మీనారాయణ, 14 సర్కిల్ ప్రతినిధులు జానపల్లి అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.