ముద్రగడ నివాసంలో జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేసారు. ముద్రగడ పై టీవీ-9 చేనల్ లో వై.సీ.పీ. లో చేరుతున్నట్టు ఆవాస్తవ ప్రచారాలు చేయడం దారుణమని అన్నారు. ముద్రగడ త్వరలోనే జనసేనలో చేరుతారని వెళ్లడించారు. పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారు ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ చేస్తారని కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురించారని అవన్ని ప్రజలు నమ్మొద్దని ఈ సందర్బంగా తెలియచేశారు. ఈ నెల జనవరి 20 వ తేదీ లోపు కానీ 23 వ తేదీ తరువాత పవన్ కళ్యాణ్ కిర్లంపూడి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నారు.ఈ నెలాఖరులో పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి రాష్ట్రంలో జనసేన టిడిపి పార్టీ పొత్తు తో అధికారం లో కి వస్తామని అన్నారు.

