భారతదేశంలో మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్షిప్ లో సరైన డాక్యుమెంటేషన్ లేకుండా అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణతో ఎనిమిది మంది బంగ్లాదేశ్ వాసులను ముంబై పోలీసులు అరెస్టు చేసారని ఒక అధికారి తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న నవీ ముంబైకి చెందిన యాంటీ ట్రాఫికింగ్ సెల్ సోమవారం ఉదయం బేలాపూర్ ప్రాంతంలోని షాబాజ్ గ్రామంలోని హౌసింగ్ కాంప్లెక్స్ లో ఉన్న ఒక ఫ్లాట్‌పై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.
20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు చెల్లుబాటయ్యే పత్రాలు లేకుండా అక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించామని వారు వెళ్లడించారు. బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించిన వీరంతా గత నాలుగేళ్లుగా ఫ్లాట్‌లో ఉంటున్నారని ఎన్నారై సాగ్రీ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు. ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, పాస్‌పోర్ట్ చట్టం మరియు విదేశీయుల చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారిన పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
