Viral

ముంబై-బౌండ్ ఇండిగో ఫ్లైట్ కు బూటకపు బాంబు బెదిరింపులు…

indigo

చెన్నై నుంచి ముంబైకి మంగళవారం బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ 6E 5149కి బాంబు బెదిరింపు వచ్చింది. న్యూఢిల్లీలోని ఇండిగో కాల్ సెంటర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో రాత్రి 10:30 గంటలకు విమానం ముంబైలో ల్యాండ్ అయింది. ఈ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు ఇండిగో అధికార ప్రతినిధి ధృవీకరించారు.

విమానంతో పాటు చెన్నై, కోయంబత్తూరు, పాట్నా, వడోదర, జైపూర్ తో సహా పలు ఇతర విమానాశ్రయాలకు బాంబు హెచ్చరికలు అందాయని నివేదికలు తెలిపాయి. బూటకపు బెదిరింపులు ఇమెయిల్ ద్వారా పంపబడ్డాయని వెళ్లడించాయి. చెన్నై నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 5149కి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత సిబ్బంది ప్రోటోకాల్‌ను అనుసరించారు.

అనంతరం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులంతా సురక్షితంగా విమానం నుంచి దిగినట్లు సిబ్బంది తెలిపారు. మేము భద్రతా సంస్థలతో కలిసి పని చేస్తున్నామని మరియు అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ఉంచబడుతుందని ప్రతినిధి చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.