మీచౌంగ్ తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన కుటుంబాలకు సామర్లకోట కు చెందిన ఎస్కే బాయ్స్ ఆధ్వర్యంలో కూరగాయలు, కిరాణా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సామర్లకోట పట్టణంలో 31వ వార్డు భాస్కర్ కాలనీలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీలో పలు వీదుల్లో గృహాల వద్దకు నీరు చేరింది. దానితో వార్డు కౌన్సిలర్ పాగా సురేష్ కుమార్ దానిపై స్పందించారు.
దానితో ఆయన సహకారంతో భాదిత కుటుంబాలకు వారం రోజులకు సరిపడా కూరగాయలు, కిరాణా సరుకులు, పాలు వంటి నిత్యవసర సరుకులను ఎస్కే బాయ్స్ పంపిణీ చేశారు. అలాగే ముంపు ప్రాంతాల్లో కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఇంకా ఏ.ఎన్.ఎం లతో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించి అవసరమైన సేవలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎస్కే బాయ్స్, ఏ.ఎన్.ఎం. లు పాల్గొన్నారు.

