మహిళల రక్షణ చట్టాలపై నేటి యువతీ యువకులకు అవగాహన అవసరమని పెద్దాపురం డీ.ఎస్.పీ. లతా కుమారి అన్నారు. సామర్లకోట ప్రగతి మహిళ డిగ్రీ కళాశాల లో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీ.ఎస్.పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డీ.ఎస్.పీ మాట్లాడుతూ… నేటి సమాజంలో విద్యార్థులు తమను తాము ఎలా కాపాడుకో, ఆటోలు, బస్సుల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కొంతమంది ప్రజలు సైబర్ నేరాల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.
ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు నడిపే వారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని, తెలియని లింక్స్ పై క్లిక్ చేయకూడదని తెలిపారు. సైబర్ నేరగాళ్లు మాయ మాటలు చెబుతూ ఆన్ లైన్ ద్వారా డబ్బు ఎర వేస్తారని, అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్ లకు స్పందించకూడదని వివరించారు. ఈ కార్యక్రమం లో ఇన్నర్ వీల్ క్లబ్ చైర్మన్ సీతాదేవి నాగమణి అనురాధ, ప్రగతి విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్. హిమబిందు, ప్రగతి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సత్యనారాయణ ప్రిన్సిపల్ జీ నరేష్ తదితరులు పాల్గొన్నారు
మహిళల రక్షణ చట్టాలపై అవగాహన అవసరం… -పెద్దాపురం డీ.ఎస్.పీ.-

