Maharashtra

మహారాష్ట్రలో నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండు…

bjp

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పేలవమైన పనితీరు కనబరిచిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో తమ నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీ.జే.పీ., ఎన్‌.సీ.పీ. కూటమి విజయంపై దృష్టి సారించనున్నట్లు ఆ పార్టీ పేర్కొంది.

పార్టీ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన మహారాష్ట్ర బీ.జే.పీ. కోర్ గ్రూప్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీ.జే.పీ. ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ… మహారాష్ట్రలో నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. ఈ సమావేశానికి బీ.ఎల్. సంతోష్, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, చంద్రశేఖర్ బవాన్‌కులే, సుధీర్ ముంగంటివార్, సహా పలువురు సీనియర్ బీ.జే.పీ. నేతలు హాజరయ్యారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

Kangana-Ranaut
Maharashtra

బీఫ్ ఇష్టమని చెప్పిన రనౌత్‌కు బీ.జే.పీ. టికెట్… -మహారాష్ట్ర కాంగ్రెస్ నేత-

ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు బీ.జే.పీ. అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాను బీఫ్ తిన్నానని ఒకప్పుడు చెప్పారని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్
oa
Maharashtra

బైక్ ట్యాక్సీలకు గుడ్ న్యూస్ తెలిపిన మహా రాష్ట్ర ప్రభుత్వం…

రాపిడో, ఓలా మరియు ఉబర్ వంటి వాటిని స్వాగతించే వార్తలలో ముంబై, ఇతర నగరాలతో సహా పట్టణ ప్రాంతాలలో బైక్ టాక్సీలను నడపడానికి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని