మద్యం పాలసీపై CMOలో వాడి వేడి చర్చ జరుగుతుంది. తుది నిర్ణయం కోసం ఈనెల 14వ తారీఖున ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సామాచారం. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తూ నూతన ప్రభుత్వం కొత్త పాలసీ విధానాన్ని ముందుకు తేనుంది. ఇప్పుడున్న డిస్టలరీస్ అన్నిటి లైసెన్సులను రద్దు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టం ద్వారా ఇవ్వనున్నారు. కల్తీ లేని మధ్యాన్ని తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా మార్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఊరు పేరు లేని డిస్టలరీస్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేసిన జగన్ ప్రభుత్వం దీనిపై ఎంక్వైరీ కూడా వెయ్యడం జరుగుతుందని తెలియజేసారు.
మద్యం ప్రియులకు శుభవార్త చెప్పిన ఏ.పీ. ప్రభుత్వం…

