Exclusive

మతసామరస్యతకు ప్రతీక రంజాన్…

53eedf8d-5f90-457b-bd86-ef5cacb72ad4

జాతీయ సమగ్రతకు, సంస్కృతీ వికాసానికీ దోహదమయ్యే పండుగ ల్లో మానవాళికి హితాన్ని బోధించే ఆదేశం వుంటుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. ముస్లింలు రంజాన్.. క్రైస్తవులు క్రిస్మస్.. హిందువులు నవరాత్రు లుగా.. జరుపుకునే భారతీయ ఉత్సవాల్లో క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన వుంటాయన్నారు.

క్రోధి నామసంవత్సర రంజాన్ సందర్భంగా ఈద్గా మైదానంలో జరిగిన వేడుకల్లో రమణరాజు ముస్లింలతో నమాజ్ చేసే వరుసల్లో కూర్చుని ప్రార్థనలు చేశారు. నగర ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల నంతరం జామా మసీదు ఇమామ్ అబ్దుల్ రజాక్ కు పుష్పగుచ్చం అందించి మత సామరస్యతకు ప్రతీకగా సంఘీభావం తెలిపారు. రజాక్ మాట్లాడుతూ… ఇదే రీతిగా హిందువుల ఆదరాభిమానాలు ఎల్లకాలం కొనసాగాలని అల్లాహ్ ను వేడుకుంటు న్నానని పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.