కాకినాడ నగరంలో వాహనాలకు సైలెంసర్లు మార్చి భారీ శబ్దలతో రోడ్లపై వెళ్తున్న ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న బుల్లెట్ బైక్లు పై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు ఉక్కు పాదం మోపారు. ట్రాఫిక్ సీ.ఐ. రమేష్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నగరం, రూరల్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ. లు పి. కిషోర్ కుమార్, సి.హెచ్. కిషోర్ కుమార్, అప్పలరాజు, వెంకటరత్నం, ఏసుబాబు ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో బుల్లెట్ వాహనాలు తనిఖీలు చేశారు.
ఆ వాహనాలలో భారీ శబ్దాలు ఇచ్చే 23 వాహనాలను సీజ్ చేసి కంట్రోల్ రూమ్ కి తరలించారు. వాహనాలకున్న సైలెన్సర్లను తీసివేసి వెయ్యి రూపాయలు చొప్పున నగదు జరిమానాన్ని విధించారు. విధ్వంసకర శబ్దాలను చేసే సైలెన్సర్లను వాహనాలకు వాడకూడదని అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. ఈ రైడింగ్ లో కిరణ్, వెంకటేష్, శివారెడ్డి, ప్రసాద్, పాల్గొన్నారు.
