గడిచిన 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 105 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త ఇన్ఫెక్షన్ల కేసుల చేరికతో దేశం మొత్తం 4,50,28,268కి పెరిగింది. ఇందులో JN-1 కోవిడ్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయని వెళ్లడించింది. కొత్త కేసుల్లో కర్ణాటకలో అత్యధికంగా 18 కేసులు, మహారాష్ట్ర 16 మరియు రాజస్థాన్ 13 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి 11 కేసులు నమోదయ్యాయని తెలిపింది. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, మరొకరు ఈ వ్యాధికి గురవ్వగా మరణాల సంఖ్య 5,33,473కి చేరుకుంది. మరోవైపు 122 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 4,44,93,920కి చేరింది.
భారత్ లో 105 కొత్త కోవిడ్ కేసులు నమోదు…
