Political

బీ.సీ.లకు సముచిత న్యాయం చేయాలి… -ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్-

WhatsApp Image 2024-02-11 at 12.26.39 PM

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్ కే.వీ.పీ. రామచంద్ర రావును ఆంధ్ర రాష్ట్ర 93 బీ.సీ. కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా బీ.సీ. లను అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆంధ్ర రాష్ట్రంలో బీ.సీ. లను ఓటు బ్యాంకుగా వాడుకొని మోసం చేస్తున్న పార్టీలు వైయస్సార్ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ గాని బీ.సీ. లకు ప్రాధాన్యతనివ్వటం లేదని వారికి తెలిపారు.

ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో బీ.సీ. లను దగా చేస్తూ అగ్రకులాలకే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కేటాయించడం జరుగుతుందన్నారు. తుని నియోజకవర్గంలో కొప్పుల వెలమ ఓట్లు 50 వేలకు పైగా ఉన్నా… తుని నియోజకవర్గం లో కాకినాడ జిల్లా నుంచి ఒక్క సీటు కొప్పుల వెలమలకు కేటాయించాలేదని అన్నారు. కనుక ఏ పార్టీ అయినా కూడా కొప్పుల వెలమలకు, ఇతర బీ.సీ. కులాలు అత్యధిక శాతం ఉన్న నియోజకవర్గాలలో అసెంబ్లీ స్థానాలలో టిక్కెట్లు ఇవ్వాలని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.