ఫిబ్రవరి 20 నుండి కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ వంటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎంపిలు మరియు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ బి.జె.పి.లో చేరతారని సీనియర్ బిజెపి మూలం తెలిపింది. చేరడం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని వెళ్లడించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా ఇటీవల ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేరికలు జరుగుతాయని తెలిపారు. బీఎస్పీకి చెందిన లాల్గంజ్ ఎం.పీ. సంగీతా ఆజాద్, అంబేద్కర్ నగర్ ఎం.పీ. రితేష్ పాండే బీ.జే.పీ. లో చేరుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
బీ.జే.పీ. లోకి భారీగా చేరనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు…

