వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని గార్బెటా ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కి చెందిన అభ్యర్థి జార్గ్రామ్ ప్రణత్ తుడు పై దాడి జరిగిందని ఆరోపించారు. బీ.జే.పీ. పోలింగ్ ఏజెంట్లను కూడా కొన్ని పోలింగ్ బూత్‌లలో అనుమతించలేదని ఫిర్యాదులు విన్న తుడు గార్బెటాకు వెళ్తున్నాడని ఒక నివేదిక తెలిపింది.
అకస్మాత్తుగా, రోడ్లను అడ్డుకున్న టి.ఎం.సి. గూండాలు తన కారు వైపుకు ఇటుకలను విసిరేయడం ప్రారంభించారని తెలిపారు. నా భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారిని గాయపరిచారన్నారు. నాతో పాటు ఇద్దరు సి.ఐ.ఎస్.ఎఫ్. జవాన్లు గాయాలు తగిలాయని, ఆసుపత్రిలో చేరవలసి వచ్చిందని తుడును ఉటంకిస్తూ పిటిఐ వెళ్లడించింది.

