Telangana

బీ.జే.పీ. నేతలు నకిలీ హిందువులు… -తెలంగాణ సీ.ఎం. రేవంత్-

maxresdefault (1)

రాజకీయ లబ్ధి కోసం రాముడి పేరును బీ.జే.పీ. వాడుకుంటోందని ఆరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీ.పీ.సీ.సీ. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాషాయ పార్టీ సభ్యులను, నాయకులను నకిలీ హిందువులని అన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, శంషాబాద్‌లో జరిగిన రోడ్‌షోల్లో సీ.ఎం. పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. బీజేపీ దృష్టిలో దేవుడు ఓట్ల కోసం, రాముడు సీట్ల కోసం నిలుస్తాడని విమర్శించారు. కానీ మనకు రాముడు రాముడేనని అన్నారు.

అయోధ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు అక్షింతలు పంచి బీ.జే.పీ. నాయకులు రాముడిని అవమానించారని, మోసం చేశారన్నారు. రేషన్ షాపుల నుంచి సేకరించిన బియ్యంలో పసుపు పొడి కలిపి అక్షింతలుగా పంపిణీ చేశారని అన్నారు. భద్రాచలం రామచంద్ర స్వామి పేరు చెప్పుకుని ప్రమాణం చేసి నిజమైన అక్షింతలు పంచారని చెప్పాలని బీ.జే.పీ. నేతలకు సవాల్ చేసారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీ.జే.పీ. కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో