స్థానిక ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో గల బాదం బాలకృష్ణ క్లినికల్ లేబ్ కు పైడా వెంకట నారాయణ, సుశీల దంపతుల ట్రస్ట్ చైర్మన్ పైడా రామకృష్ణ సుమారు 25 లక్షల రూపాయలతో అత్యాధునిక వైద్య పరికరం ఆల్ట్రా సౌండ్ మిషన్ను బాదం బాలకృష్ణకు అందజేశారు. పేదలకు అందుబాటులో ఉన్న ఈ లేబ్ కు ఇంత పెద్ద మొత్తంలో ఈ పరికరం అందజేసిన వారిని అభినందిస్తూ వారి దాన గుణానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పైడా రామకృష్ణ మాట్లాడుతూ ఈ పరికరం ద్వారా పది రకాల టెస్టులు చేయవచ్చనన్నారు. ఈ కార్యక్రమంలో పైడా వెంకట నారాయణ, పైడా వెంకటేశ్వరరావు, పైడా శ్రీనివాస్, పైడా సోమేశ్వరరావు, పైడా పద్మ, వేదుళ్లపల్లి శారదా దేవి, రమణ మూర్తి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు
బాదం బాలకృష్ణ ఐ బ్యాంకు కు 25 లక్షల ఆల్ట్రా సౌండ్ పరికరం అందించ్చిన పైడా ట్రస్ట్…
