బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలలో 32 మంది మరణించారు మరియు 2,500 మందికి పైగా గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ టెలివిజన్ భాబన్ వద్ద ముట్టడించారు. ఢాకాలోని రాంపుర ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ టెలివిజన్ భాబన్‌ను నిరసనకారులు ముట్టడించారు. వికృత గుంపు ముందు భాగాన్ని ధ్వంసం చేసిందని, పార్క్ చేసిన అనేక వాహనాలను తగలబెట్టిందని వారు వెళ్లడించారు.
జర్నలిస్టులతో సహా కొంతమంది సిబ్బందిని లోపల చిక్కుకున్నట్లు తెలిపారు. పలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్న ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలో హింస తారాస్థాయికి చేరుకుంది. నిరసనకారులు, చట్టాన్ని అమలు చేసే వారితో పాటు అధికార పార్టీ వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణల్లో 18 మంది మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారు అని డైలీ స్టార్ నివేదించింది.
