
అనంతపురము జిల్లా కుందుర్పి మండలం కనగానపల్లిలో ఆరో తరగతి చదువుతున్న బొమ్మలింగ అనే విద్యార్ధి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బొమ్మలింగ బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్తూ తన తల్లిని రెండు రూపాయలు అడిగాడు. ఉదయం ఇంటర్వెల్ సమయంలో తినుబండారాలు కొనుక్కునేందుకు ప్రతిరోజు తీసుకువెళ్తుంటాడు. అయితే అతడి తల్లి చిల్లరకోసం ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి ఇంటి సమీపంలోనే తాడుతో ఉరివేసుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి కుటుంభ సభ్యులు, స్థానికులు నిశ్చేష్టులయ్యారు. ఆరవ తరగతి వయసులోనే అంతటి క్షణికావేశానికి గురవటం పట్ల, విద్యార్థి మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

