భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత వారం పూరీకి వచ్చిన సందర్భంగా జూలై 7 రాత్రి ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు లలిత్ దాస్ మరియు మరో ఐదుగురు తన భర్తను కొట్టారని పూరీలోని రాజ్ భవన్ ఉద్యోగి భార్య ఆరోపించింది. గవర్నర్ కుమారుడిని తీసుకెళ్లేందుకు లగ్జరీ వాహనం పంపనందుకే తన భర్త బైకుంఠనాథ్ ప్రధాన్‌ను కొట్టారని సయోజ్ ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. అయితే ఒక నివేదిక ప్రకారం.. ఈ సంఘటనకు సంబంధించి రాజ్ భవన్ లేదా పోలీసుల నుండి అధికారిక ధృవీకరణ లేదు.
తన భర్తపై జరిగిన దాడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సయోజ్ ప్రధాన్ డిమాండ్ చేశారు. బైకుంఠ ప్రధాన్, రాజ్‌భవన్‌లోని గవర్నర్ సెక్రటేరియట్, గృహ విభాగం, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు. జులై 7వ తేదీ రాత్రి పూరీలోని రాజ్‌భవన్ ప్రాంగణంలో ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు లలిత్ కుమార్, మరో ఐదుగురితో కలిసి తనను చెప్పుతో కొట్టి, తన్నారని ఆరోపించారు.
