ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతకముందు అయోధ్యలో తిరిగి అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆవిష్కరించారు. తదరంతరం ఉత్తరప్రదేశ్ కోసం అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు కూడా చేస్తారు. విమానాశ్రయం నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్‌షో మార్గంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ప్రధానికి చేతులెత్తి స్వాగతం పలికారు.
వీటితో పాటు కొత్త అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి ఋషి కవి మహర్షి వాల్మీకి అనే పేరు పెట్టబడుతుందని, దీనిని ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్’ అని పిలుస్తారని వర్గాలు తెలిపాయి.
ప్రధాన మంత్రి చేతులమీదుగా కొత్త విమానాశ్రయ ప్రారంభం…

