అవినీతి అక్రమాలకు అడ్రస్ గా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నియంతగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఏకపక్ష వైఖరికి మద్దతుగా వైకాపా అధిష్టానం ప్రోత్సహించడాన్ని నిరసిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఏలేశ్వరం ఎం.పి.పి గొల్లపల్లి బుజ్జి,, రౌతులపూడి ఎం.పి.పి గంటిమల్లి రాజ్యలక్ష్మి ,బద్రవరం ఎం పి.టి సి కొప్పుల బాబ్జి, లక్ష్మీపురం సర్పంచ్ డాక్టర్ నాగభార్గవి లు పార్టీకి ముకుమ్మడి రాజీనామాలు చేశారు.
ఈ సందర్భంగా ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ 2014, 2019 ఎన్నికల్లో వైకాపా విజయానికి కృషి చేస్తామని భవిష్యత్తులో కూడా 2024 ఎన్నికల్లో తిరిగి పార్టీని గెలిపించుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినందుకు గాను తమపై కక్షగట్టి మండల పరిషత్ అధ్యక్షులుగా తాము చేయవలసిన బాధ్యతలు హక్కులకు ఆటంకాలు కల్పిస్తూ అడుగడుగునా అవమానాలుకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు.
పార్టీకి నష్టం జరుగుతున్న పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకే అధిష్టానం మద్దతు ఇవ్వడంపై నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు అవమానంగా భావించి పార్టీ నుండి బయటికి వచ్చేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెలుగురిస్తామని వైసిపి పార్టీకి రాజీనామా చేసిన పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

