భారత్ జనతా పార్టీ ఈ నెల 21వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ జిల్లాలో ప్రజా పోరు యాత్ర ను నిర్వహించి ప్రజల సమస్యలను తెలికుంటుందని కన్వీనర్ యాళ్ల వెకటేశ్వర రావు అమలాపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో వెళ్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, అభివృద్ధి నిరోధక కార్యక్రమాలపై నిలదీసేందుకే ఈ ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరూ వై.ఎస్. జగన్ ప్రభుత్వం పట్ల విసిగిపోయారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీ.జే.పీ. ని గెలిపించాలని ఈ సందర్బంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బీ.జే.పీ. నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీ.జే.పీ. యాత్ర…

