కాకినాడ జిల్లాలోని కాకినాడ నగర పరిధిలోని 10వ వార్డు దుమ్ములపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు.
చిన్న రామాలయం వద్ద నిర్వహించిన శిబిరానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని తెలిపారు. వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పలు సలహాలు, సూచనలను అందించారన్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చొరవ పట్ల స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారని వారన్నారు.
జిల్లాలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిరక్షణ జరిగినప్పుడే నిజమైన తమ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. లక్ష్య సాధన కోసం తాము సానా సతీష్ బాబు మార్గదర్శనంలో పని చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

