ప్రకాశం జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం చోటుచేసుకుంది. బెస్తవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామ సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో అమరావతి-అనంతపురం వైపు వెళ్తున్న సమయంలో అటువైపునుంచి వస్తున్న బైకును వేగంగా ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థనిక పోలీసులు వెంటనే ఘటణ జరిగిని ప్రదేశానికి వెళ్లి భాదితులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు బేస్తవారిపేట మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పవన్, రాహుల్ గా పోలీసులు గుర్తించారు. ఘటణ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
