పెద్దాపురం నియోజకవర్గంలో మూడు ప్రదాన రాజకీయ పార్టీలు పోటా పోటీగా సమావేశాలు నిర్వహించాయి. సామర్లకోట మండలం పనసపాడులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కార్యకర్తల సమావేశం నిర్వహించగా, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దవులూరి దొరబాబు సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారధులతో సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి తుమ్మల రామస్వామి తాటిపర్తిలలో వినాయక ఆలయంలో పూజలు చేసి జనసేన జనబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పెద్దాపురంలో పోటాపోటీగా జరుగుతున్న సమావేశాలు…

