కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసాయి. దానితో పెద్దాపూరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం తెల్సుకున్న అధికారులు గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడుతున్నందున పోలీసులు, గ్రామ యువకులు పహారా కాస్తున్నారని అధికారులు తెలిపారు.
పెద్దాపురంలో క్షుద్రపూజల కలకలం…
