కాకినాడలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని బాదితుడు పెండెం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సుమారు 15 మంది ఆగంతకులు తమ పెట్రోల్ బంక్‌పై దాడిచేశారని వెల్లడించారు. అడ్డువచ్చిన సూపర్‌వేజర్‌పై దాడిచేసి, రెండు లక్షల నగదుతో పాటు పెట్రోల్, డీజిల్ తీసుకువెళ్లిపోయారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జనసేన పార్టీలో చేరినందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే సహకారంతో కక్షసాదింపు చేపట్టారని వాపోయారు. ప్రభుత్వంలో ఎవరికీ రక్షణలేకుండా పోయిందని, కాకినాడ ఓటర్లు ఎమ్మెల్యేకు, అతని అనుయాయులకు తగిన గుణపాటం నేర్పుతారని రామకృష్ణ హెచ్చరించారు.
పెట్రోల్ బంకుపై ఆగంతకుల దాడి, పట్టించుకోని పోలీసులు…
