కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం, కొత్త మూలపేట గ్రామ పంచాయతీ నుంచి 73 మంది కే.ఎస్.ఈ.జెడ్. బాధితులు గురువారం జనసేన పార్టీలో స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు వారందరినీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం కమిటీ సభ్యులు తెలగంశెట్టి వెంకటేశ్వర్లు, కాట్నం విశాలి, మండల కమిటీ సభ్యులు మలక సూర్యచంద్ర, వడ్డు రాజేష్, బండి సునీల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పర్మినెంట్ జాబ్ కార్డు, ఉద్యోగం లేక నిరుద్యోగ భృతి, ఇళ్ళ స్థలాలకు అదనపు ప్యాకేజీ, కాలనీల అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతూ ఈ సందర్బంగా నాగబాబుకి వినతి పత్రం అందజేశారు. కే.ఎస్.ఈ. జెడ్. బాధిత ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేక, ఉపాధి అవకాశాలు లేక అప్పులు, జబ్బులతోనే తమ జీవితం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పిఠాపురంలో జనసేనలోకి బారీగా చేరికలు…

