రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ఆ సమస్య పరిష్కారం చేసి, ఎవరు ఇబ్బంది పడుతుంటే వారిని ఆదుకునే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున భరోసాగా అందజేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. యూ. కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్టి వర్మ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ… వై.సీ.పీ. నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నాన్ లోకల్ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతీ ప్రాంతం నాది అని భావించి సేవ చేసే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంను నా కుటుంబం అని భావించి సేవ చేస్తారని వెల్లడించారు.
పిఠాపురం ప్రజలను కుటుంబ సభ్యులుగా వ్యక్తి పవన్ కళ్యాన్…

