National

పిఆర్ఓ కె. రవి ని సన్మానించిన సహాయ పౌర సంబంధ ఆధికారులు..

1000037740

సంక్షేమ పధకాల అమలులో సహాయ పౌర సంబంధ అధికారిగా కె. రవి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని సమాచార శాఖ డిప్యూటీ డెరైక్టర్ డి. నాగార్జున కొనియాడారు. డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి పొంది విజయవాడ బదిలీ పై వెళుతున్న సహాయ పౌర సంబంధ అధికారి కె. రవిని డిఐపిఆర్ఓ కాకినాడ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సమాచారశాఖ డిడి డి.నాగార్జున మాట్లాడుతూ గడచిన మూడేళ్లుగా కె.రవి నిబద్దత, అంకిత భావాలతో సేవలు అందించి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధుల ఆదరాభిమానాలను చూర గొన్నారని ప్రసంశించారు. జర్నలిస్ట్ లకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమాలు వారికి సమగ్రంగా అందించించడంలో కె .రవి సేవలు అందరి హర్షాన్ని అందుకున్నాయన్నారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులను అందుకోవాలని డిడి నాగార్జున కాక్షించారు.
పదోన్నతి పై వెళుతున్న పిఆర్ఓ కె. రవి మాట్లాడుతూ.. ఎన్నో విశిష్టతలు కలిగిన కాకినాడ జిల్లాలో పనిచేయడం ఎంతో అనందం కలిగించిందని, తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అధికారులు ఏఈఐఈ సి. బాబూరావు, కాకినాడ డివిజనల్ పిఆర్ఓ పి.రవి, ఎపిఆర్ఓ ఎస్.అజయ్, ఎఐఈ పిఆర్ఎస్ సిద్దాంతి, సిబ్బంది జి.ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

Life Style National

‘Meri Saheli’ teams ensure safety of women travelers throughout their train journey

Railway Protection Force takes initiative Making Rail Travel safer for Women in alignment with the Prime Minister’s vision of empowering
WhatsApp Image 2023-10-14 at 2.25.16 PM
National

రైల్వే డిఆర్ఎం కు విన్నప దరఖాస్తు అందించిన నూతలపాటి అప్పలకొండ ….

మహారాజశ్రీ రైల్వే డిఆర్ఎం వారి దివ్య సముఖమునకు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ రాసుకున్న దరఖాస్తు విన్నపాన్ని అందించారు. సామర్లకోట రైల్వే