డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఎనిమిది మందికి దుప్పట్లు మరియు కూరగాయల నిమిత్తం 200 రూపాయలు సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త ఐఈ. కుమార్ మాట్లాడుతూ… పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు చాలా అమూల్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పట్ల గ్రామ ప్రజలు చాలా సంతోషించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ, పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు ఆర్ధిక సాయం… -సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ-

