జమ్మూ-కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై భారతదేశ దృఢమైన వైఖరి పాకిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని షాక్ కి గురుచేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీ.ఓ.కే. పై మొహమాటంలేకుండా ప్రకటన చేయడం మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని తేటతెల్లం చేయడమే కాకుండా పాక్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ప్రకటన ప్రభావంతో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌కు చేరుకున్నారు.
ఆర్టికల్ 370ని రద్దు చేయడం చట్టబద్ధమైనదని భారత సుప్రీంకోర్టు తీర్పును సమర్థించిన తర్వాత ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు కాకర్ పీ.ఓ.కే. కి వెళ్లినట్లు పేర్కొంది. ఈ సమస్యలపై పాకిస్థాన్ భారత్‌కు వ్యతిరేకంగా మద్దతును పొందేందుకు ప్రయత్నించగా చాలా దేశాలు భారతదేశ అంతర్గత విషయమని పేర్కొనడంతో పాక్ ప్రయత్నాలు తలకిందులయ్యాయి.
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కుదిపిన అమిత్ షా ప్రకటన…

