గడిచిన ఐదు సంవత్సరాలు నిరుద్యోగయువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా ఆపేశారు, 19 కోర్సులను ఎత్తివేసి, విద్యార్థులను చదువుకు దూరం చేశారని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు, ఏ.యూ. విద్యార్థి నాయకుడు సమయం హేమంత కుమార్ అన్న్ఆరు. బోధన ,బోధ నేతర సిబ్బందిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి, వేల రూపాయలు జరిమానాలు వేశారని మండిపడ్డారు. అందుకే ఏ.పీ. ప్రజలు, ఏపీ నిరుద్యోగ యువత, విద్యార్థులు తలుచుకొని ప్రభుత్వాన్ని కూల్చేశారన్నారు. ఈ సందర్బంగా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ వైభవం, ప్రజాస్వామ్య పద్ధతి మరల రావాలని పసుపు నీళ్లతో ఆంధ్ర విశ్వవిద్యాలయం మొక్క ద్వారాన్ని శుద్ధి చేసారు.
పసుపు నీళ్లతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారం శుద్ధి…

