Exclusive

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విశ్వరూప్…

WhatsApp Image 2024-02-23 at 3.30.46 PM

విద్యా వ్యాప్తి కై నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతూ… పిల్లలు బడికి ఆకర్షితులయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిధిలో బండారులంక గ్రామంలో పలు ప్రారంభోత్స వాల శంకుస్థాపన కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. తొలుత మండలం గ్రామంలో వేదాంత కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులైన రూ. 38 లక్షల రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ను ఆయన ప్రారంభించారు.

నాడు నేడు మొదటి దశ కార్యక్రమంలో సుమారు రూ. 44.87 లక్షలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధునికరించిన వసతులను ప్రారంభించారు. తదనంతరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులైన రూ. 23.94 లక్షల వ్యయoతో నిర్మిం చిన రైతు భరోసా కేంద్రo-2 ను ఆయన ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి బేబీ మీనాక్షి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దoగేటి డోలామణి రుద్ర, జడ్పిటిసి పందిరి శ్రీహరి రామ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.