డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దంగేటి బాలమణిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన సంస్కరణలను విద్యారంగంలో ప్రవేశపెట్టి విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేసారన్నారు. దీని ప్రభావంతో చాలామంది సివిల్ సర్వీస్ వంటి ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.
అనంతరం నల్ల వంతెన పాలగుమ్మి మీదుగా ముక్కామల వరకు నిర్మంచిన బీటీ రోడ్డును ప్రారంభించారు. దానితరువాత నడిపూడిలో నిర్మంచిన హై లెవెల్ వంతెనను ప్రారంభించారు. అనంతరం పాలగుమ్మి ఫుట్పాత్ బ్రిడ్జి నుండి కంభంపాడు వరకు నిర్మించనున్న బీ.టీ. రోడ్డుకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో వక్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్, ఎం.పి.పి. బొంతు గోవిందశెట్టి, కార్యదర్శి రామకృష్ణ, పంచాయతీరాజ్ డీ. రాజ్ కుమార్, జడ్పిటిసి పందిరి శ్రీహరి రాంగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
