Education / Career

పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయండి…

WhatsApp Image 2024-02-05 at 6.48.59 PM

కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రిబవరి 10,11,12 వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ.) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగబోయే పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి, ఎస్.ఎఫ్.ఐ., యూ.టీ.ఎఫ్. నాయకులు కోరారు.

ఇందులో భాగంగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సంభందిత పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి నాగమణి మాట్లాడుతూ… పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలో భయాన్ని పోగొట్టి పరీక్షలో విజయం సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాకినాడ జిల్లాలో విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

ఎస్.ఎఫ్.ఐ. జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లు పి. వరహల్, ఎం. గంగాసూరిబాబు యూ.టీ.ఎఫ్. జిల్లా అధ్యక్షులు నగేష్ సంయుక్తంగా మాట్లాడుతూ… విద్యారంగ పరిరక్షణ కోసం గత 25సంవత్సాల నుండి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ. నగర కార్యదర్శి ఎ. వాసుదేవ్, నాయకులు డి. ఆదర్శ్ కార్తిక్, యూ.టీ.ఎఫ్. జిల్లా కార్యదర్శి వి. మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM
Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ
sch
Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన